రాష్ట్రంలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. జనవరి 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా ఫిబ్రవరి 5, 9, 13, 17న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.
అయితే ఏపీ సీఎస్‌తో భేటీ జరిగిన కొద్దిసేపటికే ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ ఎస్‌ఈసీని సీఎస్ కోరారు. దీనికి సంబంధించి సీఎస్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
- ఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- ఈ నెల 31న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
- వచ్చే నెల 4న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
తేదీలు ప్రకటన
- ఫిబ్రవరి 5న తొలిదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 9న రెండోదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 13న మూడోదశ పంచాయతీ ఎన్నికలు
- ఫిబ్రవరి 17న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు