ETV Bharat / city

'కౌంటింగ్ ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా చూడాలి' - ap sec nimmagadda ramesh kumar

రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలు ప్రకటించేలా చూడాలని ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలిచ్చారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులకు సూచించారు.

ap-sec-issued-additional-guidelines-on-municipal-election-counting
'కౌంటింగ్ ప్రక్రియ మరీ ఆలస్యం కాకుండా చూడాలి'
author img

By

Published : Mar 13, 2021, 8:51 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను మరీ ఆలస్యం కాకుండా చూడాలని ఆ రాష్ట్ర ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఆదేశించారు. రాత్రి 8 గంటల్లోగా అన్ని ఫలితాలనూ ప్రకటించేలా చూడాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అదనపు మార్గదర్శకాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులకు సూచించారు. ప్రత్యామ్నాయంగా జనరేటర్లు, ఇన్వర్టర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియను వెబ్ క్యాస్టింగ్, వీడియోగ్రఫీ లేదా సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించాలని.. కౌంటింగ్ ప్రక్రియ పుటేజీని ఎన్నికల రికార్డుగా భద్రపరచాల్సిందిగా సూచించారు.

మరీ ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. 10 కంటే తక్కువ మెజారిటీ ఉన్న సమయంలో మాత్రమే.. నిబంధనలు, మార్గదర్శకాల మేరకే రీకౌంటింగ్​కు అనుమతించాలని సూచించారు. రెండంకెల మెజారిటీ వచ్చిన చోట.. అభ్యర్ధి చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్​కు నివేదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల ఫలితాల ప్రకటన సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా.. వివరాలు అందించేందుకు మీడియా కోసం.. ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చదవండి : ఓటమి భయంతో ఓట్లను కొంటున్నారు: కోమటిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.