ETV Bharat / city

ఆ రెండు సంస్థలకు విద్యుత్ టారిఫ్​లను తగ్గించిన ఏపీప్రభుత్వం

గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన ల్యాంకో, స్పెక్ట్రమ్​ల నుంచి కొనుగోలు చేయాల్సిన విద్యుత్ టారిఫ్​లను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. సవరించిన విద్యుత్ యూనిట్ ధరలను సవరించటంతో తగ్గింపు డిస్కమ్​లకు బదిలీ కానుంది. గతంలో ఈ రెండు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించిన ప్రభుత్వం.. ఈ ఏడాది సెప్టెంబరు వరకూ సరఫరా చేసే విద్యుత్ యూనిట్ కొనుగోలు ధరను తగ్గించటంతో డిస్కమ్​లకు రూ.60 కోట్ల మేర ఆదా కానుంది.

ఆ రెండు సంస్థలకు విద్యుత్ టారిఫ్​లను తగ్గించిన  ఏపీప్రభుత్వం
ఆ రెండు సంస్థలకు విద్యుత్ టారిఫ్​లను తగ్గించిన ఏపీప్రభుత్వం
author img

By

Published : Jul 22, 2020, 9:27 PM IST

ఏపీలో ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలైన ల్యాంకో, స్పెక్ట్రమ్​ల యూనిట్ ధరల్ని తగ్గించటంతో డిస్కమ్​లకు రూ.60 కోట్ల మేర ఆదా కానుంది. ఈ రెండు సంస్థలతో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించి కొత్త ధరకు విద్యుత్ సరఫరా చేయాల్సిందిగా ఏపీఈఆర్సీ చేసిన ఆదేశాల మేరకు విద్యుత్ యూనిట్ సరఫరా ధరను సవరించారు.

గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థ ల్యాంకో సంస్థ ఒక్కో యూనిట్ విద్యుత్తును రూ.3.29 పైసలు, మరో సంస్థ స్పెక్ట్రమ్ రూ.3.31 పైసలకు విక్రయిస్తోంది. ఈ రెండు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సమీక్షించిన ఏపీ ప్రభుత్వం ఇక నుంచి ఒక్కో యూనిట్ కు ల్యాంకో సంస్థకు రూ.2.69 , స్పెక్ట్రమ్ సంస్థకు రూ.2.71 మాత్రమే చెల్లించాలని డిస్కమ్​లను ఆదేశించింది. ఏపీఈఆర్సీ సూచించిన ఈ టారిఫ్​లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ వర్తించనున్నాయి.

ఆ తరువాత ఈ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలా.. వద్దా అనే అంశాన్ని నిర్ధారించనున్నారు. సెప్టెంబరు నెల వరకూ ఈ రెండు సంస్థల నుంచి వెయ్యి మిలియన్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కొత్తగా సమీక్షించిన ధరలతో యూనిట్​కు 60 పైసల చొప్పున మొత్తం రూ.60 కోట్ల వరకూ డిస్కమ్​లకు ఆదా కానుంది.

2016తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగిసిందన్న కారణంతో ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ అనుమతించలేదు. అయితే లాక్​డౌన్ సమయంలో బొగ్గు సమస్య రావొచ్చని భావించిన డిస్కమ్ గ్యాస్ విద్యుత్​ను తీసుకోవాలని నిర్ణయించాయి. దీంతో రెండు సంస్థల నుంచి ఒప్పందాలను సమీక్షించిన అనంతరం విద్యుత్ కొనుగోలు చేశారు. ధరల సమీక్ష అనంతరం ఆదా అయిన మొత్తాన్ని డిస్కమ్​లు విద్యుత్ వినియోగదారులకు బదిలీ చేస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి: మంత్రులుగా ప్రమాణం చేసిన అప్పలరాజు, వేణుగోపాల్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.