ETV Bharat / city

ప్రచారానికి సోషల్ మీడియాలో సై - ఏపీ పంచాయతీ ఎన్నికల వార్తలు

అభ్యర్థి పేరుతో వాట్సాప్ గ్రూప్.. పార్టీ పేరుతో మరో గ్రూపు. అన్నొస్తున్నాడూ.. అంటూ పాటలు.. ఫేస్​బుక్​లో ఓటేయాలంటూ.. ప్రచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచార తీరు మారింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం జోరు చూపిస్తున్నారు.

ap panchayat elections campaign speed up in social media
ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై
author img

By

Published : Feb 3, 2021, 8:51 PM IST

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం తారా స్థాయికి చేరింది. ఇంటింటికీ వెళ్లి ఓటు అడగడమే కాదు. ఏ మాత్రం ఇమేజ్ తగ్గకుండా.. అభ్యర్థులు సామాజిక మాధ్యమాలను వాడేస్తున్నారు. ఇక్కడ.. అక్కడ అని లేదు.. ఎక్కడ పడితే అక్కడే.. తమకే ఓటేయాలంటూ.. జోరు పెంచుతున్నారు.

సమయం తక్కువ..

ఫేస్​బుక్, వాట్సాప్ వేదికగా ఎన్నికల సమరానికి మద్దతు సమీక్షిస్తున్నారు అభ్యర్థులు. రాజకీయ పార్టీల మద్దతు పొందిన అభ్యర్థులు సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో సమాచారాన్ని తెలియజేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఊర్లలో వాట్సాప్, ఫేస్​బుక్​ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంకా కరోనా ముప్పు తొలగకపోవడంతో ప్రతి ఓటరును సామాజిక మాధ్యమాల వేదికగా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమకే ఓటేయాలంటూ.. పాటలు రూపొందిస్తూ.. గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నారు.

ఎన్నికల రోజు ఊరొచ్చి..

ఆయా గ్రామాలకు చెందిన ఓటర్లు.. విద్య, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డ వారిని.. డిజిటల్ మీడియా వేదికగా ఓట్లు అభ్యర్ధిస్తున్నారు. సర్పంచ్​గా పోటీ చేస్తున్నాను.. అని విధాలుగా సహకరించాలని.. ఎన్నికల రోజు ఊరికి వచ్చి ఓటేయాలని పోస్టులు చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'ఎన్నికలు ప్రశాంతంగా జరగడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.