ETV Bharat / city

AP New DGP: కడప నుంచి డీజీపీగా... ఏపీ కొత్త పోలీస్ బాస్ ట్రాక్ రికార్డు ఇదే - తెలంగాణ వార్తలు

AP New DGP Kasi reddy rajendranath reddy: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన రాజేంద్రనాథ్‌రెడ్డి.. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పని చేస్తున్నారు. గతంలో విజయవాడ సీపీగా.. విశాఖ పోలీస్‌ కమిషనర్‌గానూ పని చేశారు.

AP New DGP Kasi reddy rajendranath reddy
కడప నుంచి డీజీపీగా... కొత్త పోలీస్ బాస్ ట్రాక్ రికార్డు ఇదే
author img

By

Published : Feb 15, 2022, 4:54 PM IST

AP New DGP Kasi reddy rajendranath reddy: కొత్త డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిది కడప జిల్లా రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామం. 1992 బ్యాచ్​కు చెందిన ఐపీఎస్ అధికారి. 1994లో తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్​లో ఏఎస్పీగా మొదటి పోస్టింగ్​లో బాధ్యతలు చేపట్టారు. 1996లో వరంగల్ జిల్లా జనగాంలో ఏఎస్పీగా, అనంతరం వరంగల్ ఏఎస్పీగానూ పని చేశారు. 1996-97 వరకు కరీంనగర్​లో ఆపరేషన్స్ ఏఎస్పీగా విధులు నిర్వర్తించారు.

1997-99లో విశాఖ రూరల్ ఎస్పీగా అనంతరం సీఐడీ ఎస్పీ, గుంతకల్లు రైల్వే ఎస్పీ, విజయవాడ రైల్వే ఎస్పీగా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. అక్కడ నుంచి నెల్లూరు ఎస్పీ, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వర్తించారు. 2006-08 వరకు ఎక్సైజ్ శాఖలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టర్​గా ఉన్నారు. 2008-10 వరకు విజయవాడ సీపీ, 2010-11 వరకు ఎన్​ఫోర్స్​మెంట్​ డీఐజీ, ఐజీగా విధులు చేపట్టారు. 2011-13 వరకు నార్త్ కోస్టల్ ఐజీగా, 2013-14 వరకు హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీగా, 2015-17 వరకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పని చేశారు.

2018-19 వరకు డ్రగ్ కంట్రోల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2019-20 వరకు విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డీజీగా.. 2020 నుంచి ఇంటెలిజెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా డీజీపీగా అదనపు బాధ్యతలను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి : కోమటిరెడ్డితో రేవంత్‌రెడ్డి మొదటిసారి భేటీ.. ఆ విషయాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.