AP Movie theater owners meet: ఏపీ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై థియేటర్ల యజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు కలిసి రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
జీఓ 35లోని నిబంధనలను అమలు చేయడంలేదన్న కారణాలతో పలుచోట్ల థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. లోపాలపై యజమానులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యజమానులు బోర్డులు పెడుతున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ ... నాలుగు కేసులు నమోదు