AP Ministers Resignations: ఏపీ కేబినెట్ మంత్రుల రాజీనామాలు రాజ్‌భవన్‌కు చేరాయి. సాధారణ పరిపాలనశాఖ అధికారులు వీటిని రాజ్‌భవన్‌కు అందజేశారు. గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత మంత్రుల రాజీనామాలను రాజ్‌భవన్ నోటిఫై చేయనుంది. వాటిని నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మరో వైపు రేపు మధ్యాహ్నం తర్వాత కొత్త మంత్రుల జాబితాను సీఎంవో కార్యాలయం రాష్ట్ర గవర్నర్‌కు సమర్పించనుంది. 11వ తేదీ ఉదయం 11.31 నిమిషాలకు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అతిథులకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. కేబినెట్‌లోని 24 మంది మంత్రులు తమ రాజీనామాల లేఖలను సీఎంకే అందజేశారు. అయితే వారిలో ఎంతమంది రాజీనామాలు రాజ్‌భవన్‌కు వెళ్లాయనేదానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో దాదాపు 8మందిని తిరిగి కొనసాగించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి: AP Ministers: రెండున్నర ఏళ్లుగా ఏపీ మంత్రులు చేసిన పని ఇదే!