ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాల వల్ల ఎన్నిక జరగకుండా నిలిచిపోయిన.. 36 సర్పంచి, 68 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా... మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. లక్షా 32 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు.
ఏపీలోని నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు మరో 12 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. వీటితో పాటు 6 నగరపాలక సంస్థలు, 4 పురపాలక సంఘాల్లోని 14 డివిజన్లు, వార్డులకు పోలింగ్ జరగనుంది. పది జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. 368 మంది బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 8 లక్షల 7 వేల 640 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఇదీచూడండి: grmb Chairman tour: రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలను పరిశీలించనున్న జీఆర్ఎంబీ ఛైర్మన్