ETV Bharat / city

AP Inter Exams: ఏపీలో కూడా నేటి నుంచే ఇంటర్ పరీక్షలు..

AP Inter Exams: అరకొర వసతుల మధ్య ఇవాళ్టి నుంచి ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో చాలా చోట్ల కనీస సదుపాయాలు లేవు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా గదుల కొరత పేరుతో కొన్ని ప్రాంతాల్లో రేకుల షెడ్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల కిలోమీటర్ల కొద్ది ప్రయాణించాల్సి ఉండగా..., మరికొన్ని చోట్ల ఫర్నీచర్‌ లేకపోవడంతో బెంచీలు, స్టూళ్లే దిక్కయ్యాయి. ఇంకొన్ని చోట్ల ప్రయోగశాలలను పరీక్షా కేంద్రాలుగా మార్పు చేశారు

AP Inter Exams
AP Inter Exams
author img

By

Published : May 6, 2022, 5:48 AM IST

AP Inter Exams: అరకొర వసతుల మధ్య శుక్రవారం నుంచి ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు మొదలవుతున్నాయి. పరీక్ష కేంద్రాల్లో చాలాచోట్ల కనీస సదుపాయాలు లేవు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా గదుల కొరత పేరుతో కొన్ని ప్రాంతాల్లో రేకుల షెడ్లలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. అక్కడ కనీసం ఫ్యాన్లూ ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులకు ఉక్కపోత బాధలు తప్పవు. ప్రయోగశాలలనూ పరీక్ష కేంద్రాలుగా మార్చేశారు. కొన్నిచోట్ల బెంచీలు, డెస్క్‌లు లేకపోవడంతో విద్యార్థులు కూర్చునేందుకు స్టూళ్లను ఏర్పాటు చేశారు. వాటిపై కూర్చుని ఒళ్లో ప్యాడ్‌ పెట్టుకుని 3గంటలపాటు పరీక్షల రాయాలంటే పిల్లలకు నడుం విరిగినంత పనవుతుంది.

ప్రయాణ ప్రయాస

నగరాలు, పట్టణాలు, మన్యం ప్రాంతం అని లేకుండా చాలాచోట్ల 10 నుంచి 44 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఉదయమే పరీక్ష ఉండటంతో ట్రాఫిక్‌ రద్దీలో విద్యార్థులు వెళ్లడం కత్తిమీద సామే అవుతుంది. మరికొన్ని చోట్ల పొలాల మధ్యలో పరీక్ష కేంద్రాలు ఉండటంతో.. అక్కడకు చేరుకోవడమే చాలా కష్టం కానుంది.

.

కనీస సదుపాయాలూ కరవే..

పలు జిల్లాల్లో రేకుల షెడ్లలో కేంద్రాలు ఏర్పాటుచేశారు.కూర్చునేందుకు బెంచీలు, రాసుకునేందుకు డెస్క్‌లూ లేక.. స్టూళ్లు ఏర్పాటుచేశారు. కనీసం ఫ్యాన్లు కూడా లేవు. మరికొన్ని చోట్ల ల్యాబ్‌ను ఖాళీ చేసి బల్లలు వేసి తాత్కాలిక పరీక్ష కేంద్రంగా మార్చారు. ఇంకొన్నిచోట్ల నిర్మాణం పూర్తికాని గదుల్లోనూ కేంద్రాలున్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో 30 ఏళ్లనాటి భవనంలో శ్లాబు పెచ్చులూడిపోయి ఇనుప చువ్వలు బయటకు కనిపిస్తున్నాయి.

.

సెల్‌ఫోన్లు నిషేధం..

పది పరీక్షల్లో ప్రశ్నపత్రాలు బయటకు రావడంతో ఇంటర్‌ పరీక్షల సిబ్బందికి సెల్‌ఫోన్లను నిషేధించారు. ఎవరైనా ఫోన్‌తో పట్టుబడితే పోలీసు కేసులు నమోదు చేస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ప్రశ్నపత్రాలు ఇవ్వగానే వాటిపై హాల్‌టికెట్‌ నంబర్లు రాయాలి. నీళ్లు అందించే సిబ్బంది సైతం 8 గంటల తర్వాత ప్రాంగణంలో ఉండకూడదు.

లొకేటర్‌ యాప్‌ ఏదీ?

ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాలను కేటాయించిన అధికారులు వాటి పూర్తి చిరునామాలు ఇవ్వలేదు. గతంలో వీటిని గుర్తించేందుకు లొకేటర్‌ యాప్‌ ఉండేది. ఈసారి దాన్ని మూలకు పడేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.