ETV Bharat / city

AP High Court On Social Media Case : ' జడ్జిలపై పోస్టులు న్యాయవ్యవస్థపై దాడే!'

author img

By

Published : Dec 5, 2021, 8:11 AM IST

AP High Court On Social Media Case : న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడం, జడ్జిలను అసభ్యకరంగా దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఆరుగురు నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లను కొట్టేసింది.

ap high court. ఏపీ హైకోర్టు
ap high court

AP High Court On Social Media Case : జడ్జిలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో ఆరుగురు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్‌ నిరాకరించింది. పత్రికల్లో రాయలేని భాషలో వారు పెట్టిన పోస్టులను ఉత్తర్వుల్లో హైకోర్టు సవివరంగా ప్రస్తావించింది. బెయిలు మంజూరు విషయంలో నేర తీవ్రత, నిందితుల పాత్ర, కేసులోని పూర్వాపరాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం తమపై ఉందని తెలిపింది. ఆరోపణల తీవ్రత, మరికొందరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం, దర్యాప్తు ఇంకా తుదిదశకు చేరుకోలేదని సీబీఐ చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టేస్తున్నట్లు పేర్కొంది.

పోస్టులు వ్యక్తిగతం కాకపోవచ్చు!

AP High Court News : సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టినవారిపై హైకోర్టు ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసిన సీబీఐ.. దర్యాప్తు చేస్తోంది. ఆ కేసులకు సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వారు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జడ్జిలపై ఆరోపణలు చేయడం, కోర్టులను అపకీర్తి పాలుచేయడమేనని.. న్యాయమూర్తి అన్నారు. అక్టోబర్ 2020లో కేసు దర్యాప్తు సీబీఐకి బదిలీ చేసినా వారిని పట్టుకునేందుకు ఏడాది పట్టిందంటే పిటిషనర్లు చిన్నవారు అయినా ఈ కుట్ర వెనుక పెద్ద తలకాయలు ఉండే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు.

హైకోర్టు, సుప్రీంకోర్టులోని కొందరు న్యాయమూర్తులపై పిటిషనర్లు పెట్టిన పోస్టులు చూస్తుంటే న్యాయవ్యవస్థపై కుట్ర పన్నినట్లు భావించాల్సి వస్తోందన్నారు. ఎక్కువ సంఖ్యలో వ్యక్తులు 2020 ఏప్రిల్ నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే పోస్టులు వ్యక్తిగతం కావని న్యాయవ్యవస్థపై దాడిగా భావించాల్సి ఉందన్నారు. బెయిల్ కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేశారు.

ఇదీ చూడండి: IAMC: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.