ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు (Ganesh idols) అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు (AP High Court) ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషిన్‌పై (Petition) హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు (Chavithi celebrations) అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 26తో (Artical-26) ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు ప్రభుత్వానికి (AP Government) లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో (Public Places) ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.
ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు
వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) వారం క్రితం ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తప్పవని స్పష్టం చేశారు. సీఎం నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ ధార్మిక సంస్థలతో పాటు, ప్రతిపక్షాలు.. ముఖ్యమంత్రి నిర్ణయంపై భగ్గుమన్నాయి. చవితి ఉత్సవాలపై ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా భాజపా ఆందోళనలు చేపట్టింది. విగ్రహా తయారీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో మాదిరిగా కొవిడ్ నిబంధనల మేరకే అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తాజాగా హైకోర్టు ఆదేశంతో వారికి ఊరట లభించింది.
ఇదీ చదవండి: Tollywood drug case : మనీలాండరింగ్ కేసులో ముగిసిన రానా విచారణ