ETV Bharat / city

ఇద్దరు ఐఏఎస్‌ల సేవా శిక్షను... 8 వారాలు సస్పెండ్ చేసిన హైకోర్టు - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

High Court on IAS Officers Appeal Petition: ఇద్దరు ఐఏఎస్​ అధికారుల సామాజిక సేవా శిక్షను 8 వారాల పాటు ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో సామాజిక సేవా శిక్ష విధించడంపై ఇద్దరు అధికారులు వేసిన అప్పీల్​ పిటిషన్‌పై హైకోర్టు డివిజనల్​ బెంచ్​ విచారణ జరిపింది.

High Court
High Court
author img

By

Published : Apr 23, 2022, 7:41 AM IST

High Court on IAS Officers Appeal Petition: ఐఏఎస్​ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ధిక్కరణ కేసులో సామాజిక సేవ శిక్ష విధిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును వారిద్దరి విషయమై 8 వారాలు నిలుపుదల చేస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణను జూన్‌ 20కి వాయిదా వేసింది.

ఏపీ హైకోర్టు విధించిన సామాజిక సేవ శిక్షను సవాల్‌ చేస్తూ... ఐఏఎస్‌ అధికారులు.. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌... ధర్మాసనం వద్ద వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం... సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కాపీ ధ్రువీకరించిన పత్రం లేకుండా... అప్పీల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ముందు ఐఏఎస్ అయినా... సామాన్య ప్రజలైనా ఒక్కటేనని తేల్చిచెప్పింది. సర్టిఫైడ్‌ కాపీని జతచేస్తేనే విచారణ చేస్తామని స్పష్టం చేసింది.

న్యాయవాదులు ధ్రువీకరించిన తీర్పు కాపీ అందజేయడంతో విచారణ జరిపింది. కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం సామాజిక సేవ శిక్ష విధించేందుకు తావు లేదని... సీనియర్ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎలాంటి శిక్షలు వేయాలో చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆ వాదనలతో ధర్మాసనం ప్రాథమికంగా సంతృప్తి చెందింది. ఈ అప్పీళ్ల విచారణలో కోర్టుకు సహకారం అందించాలని అడ్వకేట్ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌కు సూచించింది.

ఏపీలో కృష్ణా జిల్లాలోని వసతి గృహాల్లో సామాజిక సేవ చేయాలని గోపాలకృష్ణ ద్వివేది.. ఏపీలో ప్రకాశం జిల్లాలోని వసతి గృహాల్లో సేవ చేయాలని.. గిరిజా శంకర్‌ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును 8 వారాలు నిలుపుదల చేసింది. మిగిలిన అధికారుల విషయంలోనూ సర్టిఫైడ్‌ కాపీలు అందగానే అప్పీళ్లు వేస్తామని.. ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:గోల్‌మాల్ గుజరాత్‌ మోడలా.. గోల్డెన్‌ తెలంగాణ మోడలా?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.