ETV Bharat / city

AP High Court: 'ఇలాగైతే.. అత్యవసర వ్యాజ్యాలనూ తిరస్కరించే పరిస్థితి వస్తుంది'

హౌస్​మోషన్, లంచ్ మోషన్ పిటిషన్ల దాఖలు విషయంలో ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అత్యవసరం లేని వ్యాజ్యాలను విచారించాలని పిటిషనర్లు కోరితే.. భవిష్యత్తులో అత్యవసరం ఉన్న వ్యాజ్యాలనూ తిరస్కరించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.

ap high court
ap high court
author img

By

Published : Nov 24, 2021, 11:28 PM IST

ap high court on housemotion petitions: అత్యవసర సమయాల్లో విచారణ కోసం దాఖలు చేసే హౌస్​మోషన్, లంచ్ మోషన్ పిటిషన్ల విషయంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతగా అత్యవసరంకాని వ్యాజ్యాలను కూడా అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరితే.. భవిష్యత్​లో అత్యవసరం ఉన్న వ్యాజ్యాలను తిరస్కరించే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించింది.

ఈనెల 24న కృష్ణా జిల్లా కొండపల్లి పురపాలక ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఆర్వోను ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి 23న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులపై అత్యవసరంగా (ap high court on lunchmotion petitions) లంచ్ మోషన్​లో అప్పీల్ వేయడానికి అనుమతివ్వాలని హైకోర్టు ధర్మాసనం ముందు వైకాపా కౌన్సిలర్ల తరపున న్యాయవాది కోరారు. అందుకు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి నిరాకరించింది.

గతంలో ఒక ఎన్నిక విషయమై రాత్రి 10 గంటల సమయంలో హౌస్ మోషన్ అనుమతి కోరారని గుర్తు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. ఎన్నికల వ్యవహారంలో అత్యవసరం ఏముంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. నిజంగా అత్యవసరం ఉన్న అంశాల్లోనే న్యాయవాదులు హౌస్ మోషన్, లంచ్​ మోషన్ పిటిషన్ల అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

ఇదీచూడండి: తెలంగాణ పశుసంవర్ధక శాఖపై కర్ణాటక మంత్రి ప్రశంసలు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.