Social Media Posts Against Judges Case: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తుల మీద అసభ్య పోస్టుల కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచ్ ప్రభాకర్ కేసుపై న్యాయవాది అశ్వినీ కుమార్ మెమో దాఖలు చేశారు. కొత్త పద్ధతిలో పంచ్ ప్రభాకర్ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారని నివేదించారు. ప్రైవేట్ యూజర్ ఐడీల ద్వారా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు వివరించారు. వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది. అలాంటివన్నీ వెంటనే తొలగించాలని యూట్యూబ్‌ను ఆదేశించింది.
కౌంటర్ దాఖలు చేయండి.. సీబీఐకి ఆదేశాలు
పంచ్ ప్రభాకర్ అరెస్టుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. పంచ్ ప్రభాకర్‌కు అమెరికా పౌరసత్వం ఉందని.. అరెస్టు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి కావాలని సీబీఐ తెలిపింది. కేంద్రం అనుమతి కోసం దరఖాస్తు చేశామని చెప్పింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ వేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: Sangameshwara And Basaveshwara : సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టిన సీఎం