ETV Bharat / city

Anandayya medicine: ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం తుది ఆదేశాలు - ap govt green signal to anandayya medicine

ఆనందయ్య మందు పంపిణీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సోమవారం రోజు తుది ఆదేశాలు ఇస్తామని కోర్టు వెల్లడించింది.

ఆనందయ్య మందు పంపిణీపై సోమవారం తుది ఆదేశాలు: హైకోర్టు

author img

By

Published : Jun 4, 2021, 6:50 PM IST

ఆనందయ్య మందు పంపిణీపై తుది ఆదేశాలు సోమవారం నాడు ఇవ్వనున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. మందు పంపిణీకి సంబంధించి దాఖలైన పిటిషన్​పై జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ రమేష్​లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఆనందయ్య మందులోని నాలుగు రకాలకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతించిందని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కంటి మందు పంపిణీకి సంబంధించి శాస్త్రీయపరమైన అంశాలు రుజువు కానందున అనుమతికి కొంత సమయం కావాలని కోరారు. ఆనందయ్య మందు పంపిణీ అంశంపై విచారణ పూర్తయిందని.. సోమవారం నాడు తుది ఆదేశాలు వెల్లడిస్తామని కోర్టు వెల్లడించింది.

ఇదీ చదవండి: Ministers Fire: ఓనర్లమని చెప్పి క్లీనర్​గా మారావ్..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.