ETV Bharat / city

New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటులో మరో కీలక ముందడుగు.. - ap news

New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు అందజేసింది.

New Districts in AP
New Districts in AP
author img

By

Published : Jan 25, 2022, 10:44 PM IST

New Districts in AP: కొత్త జిల్లాల ఏర్పాటులో ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఆన్‌లైన్‌లోనే మంత్రుల ఆమోదాన్ని స్వీకరించింది. ఆన్‌లైన్‌లోనే కొత్త జిల్లాల ఏర్పాటు వివరాలను మంత్రులకు అందజేసింది.

ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్...!

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన ప్రభుత్వం.. ఒకటిరెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. అయితే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం దీనికి ప్రతిబంధకంగా మారనుంది. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు జిల్లాల భౌగోళిక సరిహద్దులు మార్చరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. జనాభా లెక్కల సేకరణ 2021 మే నాటికి పూర్తి కావలసి ఉండగా కొవిడ్‌ వల్ల వాయిదా పడింది. అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను అధిగమించి కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలా ముందుకు వెళుతుంది? ఏమైనా ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోందా? అన్న విషయంలో స్పష్టత రావలసి ఉంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచన. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గం భౌగోళికంగా విస్తారమైనది కావడంతో... దాన్ని 2 జిల్లాలుగా చేయాలన్న ఆలోచన ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాల్ని.. 26 జిల్లాలుగా చేయాలన్నది ప్రతిపాదన. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్నీ ఒక జిల్లాగా చేసే క్రమంలో... కొన్నిచోట్ల ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న నగరంలో కొంత భాగం కొత్తగా ఏర్పడే జిల్లాల్లోకి వెళ్లనుంది. అంటే ఒక నగరం లేదా, పట్టణంలోని కొంత భాగం ఒక జిల్లాలోను, మరికొంత భాగం మరో జిల్లా పరిధిలోను ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం విషయంలోనూ స్పష్టత రావలసి ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో మరింత వేగం పెంచినట్లు కనిపిస్తోంది.

ఇదీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.