లాటరీ స్కీమ్‌ను ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ లాటరీలను నిర్వహిస్తున్నారు. ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి పథకం కొనసాగింది. వ్యతిరేకత వచ్చిన కారణంగా... కొన్నాళ్లకు స్వస్తి పలికారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగించడానికి నిధుల లభ్యతను పెంచుకోవాల్సిన అత్యవసరం ప్రభుత్వానికి ఏర్పడింది. మద్యం విక్రయాలను దశల వారీగా నిలిపివేస్తున్న కారణంగా... ఆదాయం క్రమేణా తగ్గనుంది. ఇందుకు బదులుగా.. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం నేరుగా లేదా ఏజెన్సీల ద్వారా లాటరీ స్కీమ్‌ను నడిపిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఇటీవల సమీక్షించారు.
ఇదీ చదవండి: