AP High Court on GO's: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులపై ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 53, 54జీవోలను చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇవాళ విచారించిన హైకోర్టు.. మేనేజ్‌మెంట్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.
ఏకపక్షంగా జోవోలు జారీ..
AP high court on school fee GO's: ఏపీలోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 24న 53, 54 జీవోలు ఇచ్చింది. అయితే, వీటిని సవాలు చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరఫున గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి.
ap high court cancelled GO's: రుసుములను ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, వ్యయాలను దృష్టిలో పెట్టుకోలేదని గుర్తుచేశాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులతో విద్యా సంస్థల నిర్వహణ, మెరుగైన విద్యా బోధన సాధ్యం కాదని సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, పి.వీరారెడ్డి గతంలో కోర్టుకు తెలిపారు. తల్లిదండ్రులు సంతృప్తి చెంది ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తారంటూ వాదనలు వినిపించాయి. అయితే, పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా ఆ జీవోలను తోసిపుచ్చింది.
- ఇవీ చదవండి
- AP HC on GO: జీవోలను వెబ్సైట్లో పెట్టకపోవడమేంటి?
- AP High Court Fire On State Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
- Singareni Medical College: 'సింగరేణి కార్మికుల 50 ఏళ్ల కల సాకారం కాబోతోంది'
- Jagan bail cancellation petition: జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై తీర్పు రిజర్వ్
- కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంగతేంటి.?: హరీశ్ రావు
- Talasani On BJP Leaders: భాజపా నాయకులు రాష్ట్రానికి ఏం చేశారు?: తలసాని