ETV Bharat / city

ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు ఏపీ సర్కార్ అనుమతి

author img

By

Published : Jul 27, 2020, 5:28 PM IST

ఏపీలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్​లలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ap corona news
ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు ఏపీ సర్కార్ అనుమతి

ఏపీలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్​లలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నుంచి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షకు ధరలు నిర్ణయిస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

ధరలివే...

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లలో ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా పరీక్షలకు 750 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయరాదని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే ఒక్కో పరీక్షకు రూ.2800 ధరను నిర్ణయించింది. ఈ మొత్తంలోనే ర్యాపిడ్ కిట్​తో పాటు పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం ఉంటుందని ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్​లు, ఆస్పత్రులకు స్పష్టం చేసింది.

పర్యవేక్షణ ఇలా..

ఈ ధరలకు పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేయాలని... ఈ వ్యవహారాలను ప్రత్యేక నోడల్ అధికారి పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ వెబ్​సైట్​లకు కూడా ఈ పరీక్షల ఫలితాలను అప్​లోడ్ చేయాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్​లలో జరిగే పరీక్షలు, వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

ఇవీచూడండి: కరోనాను ఓడిద్దాం.. ప్రాణాలతో నిలుద్దాం: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.