ETV Bharat / city

'గతంలో రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టండి' - ఏపీ తాజా వార్తలు

Rushikonda excavations: ఏపీ విశాఖ రుషికొండ తవ్వకాల విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని తెలిపింది. తవ్వకాలపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

supreme
supreme
author img

By

Published : Jun 1, 2022, 1:42 PM IST

Rushikonda excavations: ఏపీ రుషికొండ తవ్వకాల అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేరే ఎక్కడా ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వట్లేదని తెలిపింది. కొత్తగా తవ్విన ప్రదేశంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని తేల్చి చెప్పింది. ఆర్థిక వ్యవస్థ బలోపేతం ఎంత ముఖ్యమో.. పర్యావరణమూ అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. భవిష్యత్‌ తరాలకు కాలుష్య రహిత వాతావరణం అందించాలని సూచింది. రుషికొండలో కాలుష్య రహిత వాతావరణం అందించే బాధ్యత అందరిపై ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు తదుపరి ఉత్తర్వులకు కట్టుబడి ఉండాల్సిందేని చెప్పింది. హైకోర్టు ఎలాంటి నిబంధనలు విధించినా వాటిని పాటించాలని తెలిపింది. ఎలాంటి క్లెయిమ్‌ చేయమని ప్రభుత్వం హామీ ఇచ్చిందని పేర్కొంది.

ఏపీ ప్రభుత్వం తరఫున అభిషేక్‌ సింఘ్వి వాదనలు నమోదు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని వ్యాఖ్యానించింది. ఎన్జీటీ భావించిన విధంగా హైకోర్టు మరో నిపుణుల కమిటీ నియమించుకోవచ్చని చెప్పింది. వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి రుషికొండలో 62 ఎకరాల్లో 9.2 ఎకరాల్లోనే నిర్మాణం చేపట్టామని అన్నారు. గతంలో ఉన్న రిసార్టు ప్రాంతంతో పాటు మరికొంత విస్తరిస్తున్నామి వాదించారు. 190 వృక్షాలే తీసేశారని అభిషేక్‌ సింఘ్వి చెప్పారు.

రుషికొండ విస్తరణ వ్యవహారంపై అభిషేక్‌ సింఘ్వీతో ధర్మాసనం విభేదించింది. గతంలో రిసార్టు ఎంతవరకు ఉందో అంతవరకే నిర్మాణాలు జరగాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో చెప్పిన విషయాలన్నీ హైకోర్టుకు కూడా చెప్పాలని తెలిపింది. హైకోర్టు వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించింది. అవకాశం ఉన్నంత త్వరగా విచారణ చేపట్టాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.

"హైకోర్టు, ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టు ఒక్కో ఉత్తర్వులిస్తే ఎలా. హైకోర్టుకు వెళ్లవచ్చు కదా. మొత్తం కొండ ఎలా తొలిచేస్తారు. పచ్చదనం మాయమైంది. భవనాల నిర్మాణం వేరు... కొండను తొలిచేయడం వేరు. రిసార్ట్‌ నిర్మాణానికి మొత్తం కొండ తొలిచేస్తే ఎలా. నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారమంతా ఫొటోలు చూపుతున్నాయి. నిర్మాణాలకు అనుమతిస్తే పర్యావరణ ముప్పు లేకుండా చేపడతారా?"- సుప్రీంకోర్టు

రఘురామ తరఫు న్యాయవాది: మొత్తం కొండ తొలిచేశారని... పునరుద్ధరించడం సాధ్యం కాదని రఘురామ న్యాయవాది అన్నారు. తాజా పరిస్థితులను వివరిస్తూ ధర్మాసనం ముందు ఫొటోలను సమర్పించారు. ఫొటోలను జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి ధర్మాసనం పరిశీలించింది. ఇదే వ్యవహారంలో హైకోర్టులో ధిక్కరణ పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్న రఘురామ న్యాయవాదిని... ఆ పిటిషన్‌లో మీరెందుకు చేరకూడదని సుప్రీంకోర్టు అడిగింది. తప్పుగా తేలితే వాళ్లు జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించింది. దీనిపై రఘురామ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని... ఇప్పుడు ఎన్జీటీ ఇచ్చిన స్టే ఎత్తివేస్తే ఇంకా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు. గత కమిటీ నివేదిక పరిగణనలోకి తీసుకునే మరో కమిటీని నియమించిందని వాదించారు. కోస్టల్‌ రెగ్యులేటరీ జోన్‌ పరిధిలోకి వస్తుందా లేదా తెలుసుకునేందుకే మరో కమిటీని వేశారని పేర్కొన్నారు. కొండ తొలిచేయడం మంచిదో... కాదో తెలుసుకోవడానికే ఎన్జీటీ తాజా కమిటీని వేసిందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:'చలానా ఖరీదు... ఓ పసివాడి నిండు ప్రాణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.