AP house scheme case: పేదలందరికీ ఇళ్ల నిర్మాణంపై సింగిల్ జడ్జీ తీర్పుని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై హైకోర్టు విచారించింది. ఈ అప్పీల్‌ను ధర్మాసనం పరిష్కరించింది. అర్హులైన పేదలు అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే తమ పిటిషన్ ఉపసంహరించుకుంటామని... పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు.
Houses scheme in AP: అర్హులైన వారికి ఇళ్ల పట్టాలిస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది... ధర్మాసనానికి చెప్పారు. ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇళ్ల పట్టాల మంజూరు కోసం మూడు వారాల్లో వినతి పత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేసేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. వినతిపత్రం ఇచ్చిన మూడు నెలల్లో జిల్లా కలెక్టర్ దానిని పరిష్కరించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి: