ETV Bharat / city

anandaya medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ - ఆనంద‌య్య ఆయుర్వేద మందు

AP government gives green signal to Anandayya drugs
anandaya medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌
author img

By

Published : May 31, 2021, 1:42 PM IST

Updated : May 31, 2021, 2:16 PM IST

13:41 May 31

anandaya medicine: ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య ఆయుర్వేద మందు(anandaya medicine)కు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( సీసీఆర్‌ఏఎస్‌) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అవి రావ‌డానికి 2- 3 వారాలు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది. కే అనే మందును క‌మిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్‌ దీనికి నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వాడితే క‌రోనా త‌గ్గుతుంద‌నడానికి నిర్ధర‌ణ‌లు లేవ‌ని నివేదిక‌లు తేల్చాయి.

ఈ మందు వాడినంత మాత్రాన మిగ‌తా మందులు వాడ‌కుండా ఉండొద్ద‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య ఇచ్చే పి,ఎల్‌,ఎఫ్ మందులు వాడొచ్చ‌ని స్పష్టం చేసింది. ఆనంద‌య్య ఔష‌ధం కోసం కొవిడ్ రోగులు వెళ్లొద్ద‌ని.. మందు పంపిణీ వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్ర‌భుత్వం ఆదేశించింది.

ఇదీ చూడండి: Sonu sood: తెలుగు రాష్ట్రాల గ్రామాలకు ఫ్రీజర్ బాక్సుల పంపిణీకి సోనూ హామీ

Last Updated : May 31, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.