AB Venkateswara Rao Posting: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేయడంతో.. 2022 మే 19న సాధారణ పరిపాలనశాఖకు ఏబీవీ రిపోర్టు చేశారు. దీంతో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జి.విజయ్ కుమార్ను రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఏబీవీని నియమించింది.
ఇవీ చదవండి: