Pensions Hike in AP: ఏపీలో వృద్ధాప్య పెన్షనర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పింఛను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇస్తున్న రూ.2,225కు... మరో 275 కలిపి లబ్ధిదారులకు రూ.2,500 అందించనుంది. 'స్పందన'పై కలెక్టర్లతో సీఎం జగన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఒమిక్రాన్ వ్యాప్తి, కొవిడ్ ఆంక్షలతో పాటు జగనన్న సంపూర్ణ గృహ హక్కు, ఖరీఫ్‌లో ధాన్యం కొనుగోళ్లు సహా రైతు సమస్యలపై అధికారులతో సీఎం జగన్ చర్చించారు.
ఈ నెల 21న సంపూర్ణ గృహహక్కు పథకం
CM jagan On Jagananna Sampoorna Gruha Hakku Scheme: ఈనెల 21న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేస్తామన్న ఆయన.. ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. వీరికి మూడేళ్లలో రూ.45 వేలు సాయం అందుతుందని చెప్పారు. జనవరిలోనే రైతు భరోసా సాయం ఇస్తామని స్పష్టం చేశారు.. సీఎం జగన్.
ఇదీచూడండి: MOVIE TICKETS: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు చేసిన హైకోర్టు