విశాఖకు రాజధాని తరలింపు దిశలో నాలుగైదు నెలల్లో అడుగులు పడతాయని భావిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు చూపాలంటే వీలైనంత త్వరలో ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఆలోపు న్యాయస్థానాల్లో కేసులు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నోటిఫికేషన్ వెనుక దురుద్దేశాలు
ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ వెనుక దురుద్దేశాలున్నాయని అందువల్లే హైకోర్టు తగిన తీర్పునిచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆలయాలపై దాడులు ఆగిన వెంటనే ఎన్నికల వ్యవహారం తెరపైకి రావటం అనుమానాస్పదంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: అనుమతి లేని ప్రాజెక్టుల పనులు ఆపేయండి : కృష్ణాబోర్డు