కుమారుడు, కోడలు కలిసి తన ఇంట్లోని విలువైన దస్త్రాలను అపహరించారని మాజీ మంత్రి కె సత్యనారాయణ రాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డుకోబోయిన తనను చివాట్లు పెట్టి.. కాపాలాదారుడిపై దాడి చేశారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన సత్యనారాయణరాజు.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-4లో నివాసముంటున్నారు. 2020 మార్చి తన భార్య జానకి చనిపోయిన తర్వాత నుంచి భీమవరంలో ఉంటున్న కుమారుడు కెవీఎస్ రాజు, కోడలు పార్వతి.. ఆస్తి కోసం తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య బతికినన్ని రోజులు.. ఆమెను పట్టంచుకోలేదని.. మరణించాక ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మరణించాకే ఆస్తి తీసుకోవాలని కోరినా పట్టించుకోకుండా దౌర్జన్యం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్... రూ.95 లక్షల విలువైన ప్రాపర్టీని సీజ్