ETV Bharat / city

PRC: పీఆర్సీ అమలు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు

పీఆర్సీ అమలు కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తూనే ఉన్నారు. అసలు ఆ నివేదికలో ఏముందో ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎంత మొత్తానికి ఫిట్‌మెంటును అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సు చేసింది? ఉద్యోగుల ఇతర డిమాండ్లలో వేటికి చోటు కల్పించిందన్న అంశాలు గోప్యంగానే ఉన్నాయి.

PRC: పీఆర్సీ అమలు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు
PRC: పీఆర్సీ అమలు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు
author img

By

Published : Aug 13, 2021, 8:32 AM IST

పీఆర్సీ అమలు కోసం ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తూనే ఉన్నారు. అసలు ఆ నివేదికలో ఏముందో ఇప్పటికీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఎంత మొత్తానికి ఫిట్‌మెంటును అశుతోష్‌ మిశ్రా కమిషన్‌ సిఫార్సు చేసింది? ఉద్యోగుల ఇతర డిమాండ్లలో వేటికి చోటు కల్పించిందన్న అంశాలు గోప్యంగానే ఉన్నాయి. తొలుత నివేదికను ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చి.. ఆనక చర్చల ప్రక్రియ ప్రారంభించి ఫిట్‌మెంటును ఖరారు చేసి వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు జీతాలే ఒకటో తేదీన అందడం లేదు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లదీ అదే పరిస్థితి.

ప్రతి ఐదేళ్లకోసారి..

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు అయిదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేస్తుంటారు. 11వ వేతన సవరణ కమిషన్‌ను 2018లోనే ఏర్పాటు చేశారు. గడువు ప్రకారం.. ఉద్యోగులకు కొత్త వేతన సవరణ 2018 జులై ఒకటినుంచి అమలు చేయాలి. అసలు వేతన సవరణ సంఘాన్ని నియమించిందే 2018 మే 28న. అప్పటినుంచి కమిషన్‌కు ఇచ్చిన గడువును ప్రభుత్వం పెంచుతూ పోయింది. అయినప్పటికీ నివేదిక అమలువైపు అడుగులు పడుతున్న దాఖలాలు లేవని ఉద్యోగుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. 2019 జులై నుంచి 27 శాతం మధ్యంతర భృతిని అమలు చేస్తున్నారు.

ఆరుసార్లు గడువు పెంపు..

11వ వేతన సవరణ సంఘం ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. 2018 మే 28న కమిషన్‌ ఏర్పాటైంది. నెల దాటాక అశుతోష్‌ మిశ్రాకు కమిషనరుగా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. నివేదిక సమర్పణకు ఏడాదిలోపు గడువు విధించింది.

* 2 నెలలకు మొదటిసారి గడువు పెంచారు. 2019 సెప్టెంబరు 30 నాటికి నివేదికివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

* మరో 2 నెలలకు రెండోసారి గడువు పెంచి 2019 నవంబరు 30 వరకు అవకాశమిచ్చారు.

* తిరిగి మూడోసారి 2 నెలల గడువు పెంచారు. 2020 జనవరి 31 నాటికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులనిచ్చారు.

* నాలుగోసారి మరో 2 నెలల గడువు పెంపు. 2021 మార్చి 31 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు.

* 2020 మార్చి నెలకు ముందు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు. వారికి సంబంధించిన వేతన సవరణ అంశాలనూ అధ్యయనం చేయాలని ప్రభుత్వం.. కమిషన్‌ను కోరింది. ఈ కొత్త అంశం చేర్చినందున 3నెలలపాటు గడువు పెంచింది. ఇది అయిదోసారి గడువు పెంపు. 2020 జూన్‌ 30 వరకు అవకాశమిచ్చింది.

* మళ్లీ ఆరోసారి 3 నెలల గడువు పెంచింది. 2020 సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.

* ఎట్టకేలకు 2020 అక్టోబరు 5న వేతన సవరణ కమిషన్‌ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించింది. నివేదిక అందాక 6 నెలలకు ప్రభుత్వం స్పందించింది. దాన్ని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల కమిటీని ఏప్రిల్‌ 1న నియమించింది. ఆ తర్వాత ఏ అడుగూ పడలేదు.

ఏ మాత్రం ఆలస్యం తగదు

పీఆర్సీ అమలు ఇప్పటికే ఆలస్యమైంది. ముఖ్యమంత్రిని కలిసిన ప్రతి సందర్భంలోనూ మేం వేతన సవరణ కమిషన్‌ నివేదిక అమలు చేయాలని కోరుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోనూ మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఇప్పటికే కొత్త పీఆర్సీ ప్రకటించి అమలు ప్రారంభించారు. పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు పీఆర్సీ అమలుకాక నష్టపోతున్నారు. 2018 జులై ఒకటి నుంచి 55శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి. - బండి శ్రీనివాసరావు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్యవేదిక ఛైర్మన్‌

నివేదిక బయటపెట్టాలి

పీఆర్సీ నివేదికలో ఏముందో వెల్లడించాలి. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చించాలి. వేతన సవరణ కమిషన్‌కు ఉద్యోగ సంఘాలు ఎన్నో ప్రతిపాదనలను సమర్పించాయి. విభాగాధిపతుల నుంచి కమిషన్‌ నివేదిక కోరి పరిశీలించింది. మా డిమాండ్లకు వేటికి ఎంతవరకు కమిషన్‌ ఆమోదించిందన్నది ముందు తెలియాలి. పీఆర్సీ అంటే కేవలం ఫిట్‌మెంటు ఖరారు, ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంటాయి. 50 శాతం తక్కువ కాకుండా ఫిట్‌మెంట్‌ ఖరారు చేసి 2018 జులై ఒకటినుంచి అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.- కె.ఆర్‌.సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌

ఉద్యోగుల డిమాండ్ల పరిస్థితేమిటో?

తంలో నివేదిక సమర్పించాక నెలలో చర్చలు ప్రారంభించేవారు. మరో నెలలో ఖరారు చేసేవారు. అసలు ఆ నివేదికను బయటపెట్టాలి. అందులో కేవలం ఆర్థికాంశాలే కాకుండా అనేకం ఉంటాయి. వాటి విషయంలో ఉద్యోగుల డిమాండుకు తగ్గట్టు నివేదిక ఉందా? లేదా? అన్నది పరిశీలించాలి. గతంలో ఇలా లేనప్పుడు అనానమలస్‌ కమిటీ వేసి మళ్లీ నివేదిక తీసుకున్న రోజులూ ఉన్నాయి.

- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ అమరావతి జేఏసీ ఛైర్మన్‌

3 ఏళ్ల 2 నెలల 16 రోజులు..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్‌ను నియమించి నేటికి పూర్తయిన రోజులు.

10 నెలల 8 రోజులు..

వేతన సవరణ కమిషన్‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాక గడిచిన రోజులు.

4 నెలల 12 రోజులు

కమిషన్‌ నివేదికను అధ్యయనం చేసి మంత్రివర్గానికి తగిన సిఫార్సులు చేసేందుకు కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేశాక గడిచిన రోజులు.

ఇదీ చదవండి: schools reopen : రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి బడులు, కాలేజీలు...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.