AP CS Files Affidavit in High Court: అమరావతి రాజధాని తీర్పుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీల అఫిడవిట్‌ను ధర్మాసనానికి సమర్పించారు. ఏపీ హైకోర్టు గత నెల 3న రాజధాని కేసులో తీర్పునిచ్చింది. నెల రోజుల్లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈనెల 3 లోగా రైతుల ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గడువు ముగుస్తున్నందున అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో.. 2024 జనవరి వరకు సమయం ఉందని.. హైకోర్టుకు తెలిపింది.
అఫిడవిట్‌లో స్పష్టంగా చెప్పలేదు.. అమరావతి అభివృద్ధిని ఇంకా జాప్యం చేసేందుకు.. ప్రభుత్వం అఫిడవిట్‌లో ఏ విషయాన్నీ స్పష్టంగా చెప్పలేదని.. ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పినా.. వారి వ్యాజ్యం వీగిపోతుందన్న విషయం ప్రభుత్వానికీ తెలుసన్నారు.
ఇదీ చదవండి: CRDA Land: 'వంద ఎకరాలు ఉచితంగా ఇస్తే.. ఆ భారమంతా మేమే భరిస్తాం'