థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులు, బొగ్గు సరఫరా, విద్యుత్‌పై ప్రణాళిక, దీర్ఘకాలిక వ్యూహాలపై సమీక్షించారు(cm jagan review on power crisis news). నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
విద్యుత్ కొరత ( power crisis in andhra pradesh news) విషయంలో సింగరేణి, కోల్‌ఇండియాతో సమన్వయం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బొగ్గు తీసుకువచ్చే రవాణా ఓడలపై దృష్టి పెట్టాలన్నారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్లు వస్తోందని అధికారులు వివరించారు. కావాల్సిన విద్యుత్ సమీకరించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి(cm jagan) సూచించారు. దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలన్న ఆయన.. 6,300 మెగావాట్లు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీలేరు(Sileru Power Plant News)లో 1,350 మెగావాట్లు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలన్నారు.
'విద్యుత్ కొరత విషయంలో సింగరేణి, కోల్ ఇండియాతో సమన్వయం చేసుకోవాలి. బొగ్గు తీసుకువచ్చే రవాణా ఓడలపై దృష్టి పెట్టండి. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత రాకుండా చూడాలి. కావాల్సిన విద్యుత్ సమీకరించుకోవాలి. దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి పెట్టండి. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. సీలేరులో 1,350 మెగావాట్లు రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపై దృష్టిసారించాలి' - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి: