ETV Bharat / city

కుయ్.. కుయ్.. ఏపీలో మండలానికో 108, 104 వాహనాలు - cm jagan launch new 104, 108 vehicles

ఆంధ్రప్రదేశ్​లో అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన 108, 104 వాహనాలు రోడ్డెక్కాయి. 201 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 1068 కొత్త వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ap cm-jagan-launch-new-104-108-vehicles-in-vijayawada
కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌
author img

By

Published : Jul 1, 2020, 11:29 AM IST

కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన ఏపీ సీఎం జగన్‌

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త 108, 104 వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. మొత్తం 1068 వాహనాలను ఆంధ్రప్రదేశ్​ విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కుయ్... కుయ్ శబ్ధాలతో విజయవాడ మార్మోగింది.

మొత్తం వాహనాల్లో 656.. 104 వాహనాలు, 412... 108 వాహనాలు ఉన్నాయి. వీటిని అత్యాధునికంగా రూపొందించారు. 104 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా మండలానికొకటి చొప్పున కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్‌కాల్‌ వచ్చిన 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో 108 అంబులెన్స్​ ఘటనా స్థలికి చేరుకునేలా విధివిధానాలు నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

ఇవీ చూడండి: అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.