ETV Bharat / city

ఆర్.కృష్ణయ్య సహా రాజ్యసభకు నలుగురి పేర్లను ఖరారు చేసిన వైకాపా - cm jagan declared

AP cm jagan declared ysrcp rajya sabha mp candidates

author img

By

Published : May 17, 2022, 5:12 PM IST

Updated : May 17, 2022, 8:29 PM IST

17:06 May 17

ఆర్‌.కృష్ణయ్యను అభ్యర్థిగా ఖరారు చేసిన వైకాపా..

YCP Rajya Sabha members
వైకాపా రాజ్యసభ అభ్యర్థులు వీరే..

ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్‌ రెడ్డి, బీద మస్తాన్‌రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధినేత, సీఎం జగన్‌ పలుమార్లు ముఖ్యనేతలతో చర్చించారు. అనంతరం అభ్యర్థులను ఖరారు చేశారు.

ఏపీ సీఎం జగన్‌ బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించారని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీల కోసమే తాను పోరాడుతున్నాట్లు తెలిపారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు మాత్రమే పరిమితమైనది కాదని స్పష్టం చేశారు. బీసీ వర్గాలకు తాను చేస్తున్న సేవను గుర్తించి ఏపీ సీఎం జగన్ అవకాశం ఇచ్చారని తెలిపారు.

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆ రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని.. సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. పరిపాలన, నామినేటెడ్‌ స్థానాల్లో బలహీనవర్గాలకు అవకాశం కల్పించి వారిని పైకి తీసుకురావాలన్నదే జగన్‌ ఆలోచన అని బొత్స అన్నారు.

బీసీలంటే బ్యాక్ వర్డ్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ అనేది సీఎం అభిప్రాయమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. భవిష్యత్తులో మహిళలకు జగన్‌ ప్రాధాన్యమిస్తారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా సమాన అవకాశాలు ఉండాలనేది సీఎం విధానమని.. మూడేళ్లలో అన్నింటా సామాజిక న్యాయాన్ని అమలు చేసి జగన్‌ నిబద్ధత పాటించారని చెప్పారు. తెదేపాలా అన్నింటినీ తాము రాజకీయం చేయడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.

ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 12న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 4, తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల ప్రక్రియ ఇలా..

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: మే 24
  • నామినేషన్ల దాఖలుకు తుది గడువు: మే 31
  • పరిశీలన: జూన్‌ 01
  • ఉపసంహరణకు తుది గడువు: జూన్‌ 03
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 10

(అదే రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు)

ఇవీ చూడండి:

Last Updated : May 17, 2022, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.