ETV Bharat / city

జగన్ వ్యక్తిగత మినహాయింపుపై తీర్పు 24కు వాయిదా - jagan cbi case

అక్రమాస్తుల కేసులో రెడ్డి సీబీఐ కోర్టుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ హాజరయ్యారు. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్... తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు మినహాయింపులు ఇవ్వొద్దని వాదించింది. పెన్నా సిమెంట్స్ కేసులో అనుబంధ అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ న్యాయస్థానం... ఈనెల 17న హాజరు కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా ఏడుగురికి సమన్లు జారీ చేసింది.

ap cm jagan
ap cm jagan
author img

By

Published : Jan 10, 2020, 4:39 PM IST

Updated : Jan 10, 2020, 5:05 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొమ్మిది నెలల తర్వాత సీబీఐ, ఈడీ కోర్టుకు హాజరయ్యారు. ఇవాళ కచ్చితంగా హాజరుకావాలని గత వాయిదాలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో... జగన్, విజయ్ సాయిరెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ, ఈడీ కోర్టుకు జగన్ హాజరు కావడం ఇదే మొదటిసారి. ఏపీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి కోర్టుకు హాజరై.. తిరిగి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

తెలంగాణ పోలీసుల భారీ భద్రత

హైదరాబాద్ నాంపల్లిలో సీబీఐ, ఈడీ కోర్టు ఉన్న గగన్ విహార్ వద్ద తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జగన్, విజయ్ సాయిరెడ్డితో పాటు పారిశ్రామికవేత్తలు ఎన్.శ్రీనివాసన్, అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, మన్మోహన్ సింగ్, మాజీ ఐఏఎస్ అధికారి శామ్యూల్, తదితరులు కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

మినహాయింపు ఇవ్వండి

ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోర్టును సీఎం జగన్ కోరారు. ముఖ్యమంత్రిగా ప్రజా విధుల్లో ఉన్నందున హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరారు. విచారణ కోసం ఏపీ నుంచి ప్రత్యేకంగా రావడం వల్ల భారీగా ప్రజా ధనం ఖర్చవుతోందని పేర్కొన్నారు. జగన్ అభ్యర్థనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు మినహాయింపులు ఇవ్వొద్దని ఈడీ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదించారు. సెషన్స్ కేసుల్లో విచారణకు నిందితులు కచ్చితంగా హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఇరువైపుల వాదనలు విన్న ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈనెల 24కి వాయిదా వేసింది.

పేరు తొలగించండి..

తన పేరు తొలగించాలని కోరుతూ ఐదు ఛార్జ్ షీట్లలో దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కలిపి విచారణ చేపట్టాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. వేర్వేరుగా కేసులు కాబట్టి వేర్వేరుగానే విచారణ జరపాలని సీబీఐ కోరింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును ఈనెల 17కి వాయిదా వేసింది.

వీరు ఈ నెల 17 హాజరు కావాలి

పెన్నా సిమెంట్స్ కేసులో అనుబంధ అభియోగపత్రాన్ని సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్, గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్, డీఆర్ఓ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈనెల 17న విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు, అధికారులు.. పెన్నా సిమెంట్స్ కు భూములు, గనుల కేటాయింపులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగం. అనుబంధ అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని జగన్, ఇతర నిందితుల వాదనను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

ఇదీ చూడండి: రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధరణ కమిటీ

Intro:Body:Conclusion:
Last Updated : Jan 10, 2020, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.