మర్కజ్‌కు వెళ్లినవారిలో అనేకమందికి కరోనా సోకడం దురదృష్టకరమని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కరోనా బాధితులు తప్పు చేసినట్లుగా చూపించవద్దని సూచించారు. కరోనా బాధితులపై మనమంతా ఆప్యాయత చూపాలని హితవుపలికారు. అనుకోకుండా జరిగిన ఘటనగానే భావించాలని చెప్పారు.
కరోనా కాటుకు కులం, మతం, ప్రాంతం, ధనిక, పేద తేడా లేదని జగన్ తెలిపారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు తోడుగా ఉండాలన్నారు. కంటికి కనిపించని వైరస్‌పై మనమంతా పోరాటం చేద్దామన్నారు. రేపు రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్యారోగ్య, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు ఇస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: లైట్స్ ఆపితే పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందా?