ETV Bharat / city

చింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు - ఏపీ తాజా వార్తలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్ ట్రెండ్‌సెట్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటి వద్ద ఏపీ సీఐడీ పోలీసులు హల్‌చల్‌ చేశారు. ఆ సమయంలో విజయ్‌ ఇంట్లో లేకపోవడంలో పనిమనిషికి నోటీసులు అందజేశారు. విజయ్​ ఈనెల 6న మంగళగిరి సీఐడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ ఘటనపై తెదేపా నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు.

ఏపీ సీఐడీ
ఏపీ సీఐడీ
author img

By

Published : Oct 1, 2022, 4:49 PM IST

ఆంధ్రప్రదేశ్​ తెదేపా సామాజిక మాధ్యమ బాధ్యుడు చింతకాయల విజయ్​కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6వ తేదీన ఉదయం 10.30 నిమిషాలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ క్రైం పోలీస్ స్టేషన్​లో హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 12గంటల సమయంలో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో ఉన్న విజయ్ ఇంటికి సీఐడీ పోలీసులు వెళ్లారు.

అపార్ట్​మెంట్ కాపలాదారుడిని ఇంటి చిరునామా అడిగారు. అక్కడే ఉన్న విజయ్ డ్రైవర్​ను కాపలాదారు పిలిచాడు. డ్రైవర్​ను వెంట పెట్టుకొని సీఐడీ పోలీసులు విజయ్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సమయంలో విజయ్ ఇంట్లో లేరని పనిమనిషి చెప్పారు. సీఐడీ పోలీసులు ఇంటి లోపల ఉన్న గదులను మొత్తం వీడియో తీశారని పని మనిషి తెలిపారు. విజయ్ పెద్ద కూతురిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారని పని మనిషి చెప్పారు. ఇంట్లోకి తీసుకెళ్లాలని తనపై చేయి చేసుకున్నారని విజయ్ కారు డ్రైవర్ తెలిపారు.

ఓ కేసులో 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు మాత్రమే ఇంటికి వచ్చామని సీఐడీ అధికారి పెద్దిరాజు తెలిపారు. నోటీసులు ఇచ్చి వెళ్తున్న సమయంలో కొంతమంది తెదేపా నాయకులు విజయ్ ఇంటికి చేరుకున్నారన్నారు. ఇంట్లో దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ సీఐడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. వచ్చింది పోలీసులా కాదా అని అనుమానం ఉందని బంజారాహిల్స్ పీఎస్​లో తెదేపా నాయకులు ఫిర్యాదు చేశారు.

ఏపీ సీఐడీ రూల్స్​ను అతిక్రమించి ప్రవర్తిస్తోంది: సీఐడీ రూల్స్​ను అతిక్రమించి ప్రవర్తిస్తోందని ఏపీ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా అని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారని నిలదీశారు. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారని స్పష్టం చేశారు.

ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్న అయ్యన్న.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడు తప్పు చేయలేదన్న అయన బెదిరిస్తే వెనక్కి తగ్గే వాళ్లం కాదని స్పష్టం చేశారు. పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటి గోడను పడగొట్టారని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్ దోపిడీని ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలా అని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఇంట్లో యజమానులు లేని సమయంలో ఆడవాళ్లను, చిన్న పిల్లలను బెదిరిస్తారా అని దుయ్యబట్టారు. జనం జగన్‍పై తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.

ఏపీ సీఐడీ నిబంధనలు అతిక్రమిస్తోంది. ఏపీ సీఎం ఇంట్లో చిన్న పిల్లలు లేరా?. నోటీసులు ఇవ్వకుండా సీఐడీ అధికారులు ఎలా వస్తారు?. ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. చట్టప్రకారం వ్యవహరిస్తే ఎవరైనా సహకరిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులా?. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలు?. నోటీసులు ఇవ్వకుండానే ఇంటి గోడ పడగొట్టారు. జగన్‍పై జనం తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉంది." -అయ్యన్నపాత్రుడు

ఇవీ చదవండి: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం.. రోడ్లన్నీ జలమయం..

కాంగ్రెస్ అధ్యక్ష పోరు ఇద్దరి మధ్యే.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.