ఏపీ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అమరావతి భూములకు సంబంధించిన ఆధారాలుంటే చూపాలని పేర్కొంది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ - 160 కింద నోటీసులు ఇచ్చింది.
ఏపీ రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు సంబంధించిన భూముల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే ఆర్కే.. గత నెల సీఐడీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐడీ.. మాజీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.