ETV Bharat / city

AP CID Raids lakshmi narayana house: విశ్రాంత ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు - telangana news

AP CID Raids lakshmi narayana house : హైదరాబాద్​లోని మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. లక్ష్మీనారాయణ పలు అక్రమాలు చేశారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఇందులో భాగంగానే అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

AP CID Raids, former ias lakshmi narayana
మాజీ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
author img

By

Published : Dec 10, 2021, 12:51 PM IST

Updated : Dec 10, 2021, 7:39 PM IST

AP CID Raids lakshmi narayana house : మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఈ నెల 13వ తేదీన విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలకు వచ్చిన సీఐడీ అధికారులను లక్ష్మీనారాయణ మొదట ఇంట్లోకి అనుమతించలేదు. తనిఖీకి గల కారణాలను చూపించాలని కోరారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులకు, లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు స్వల్ప వాగ్వాదం జరిగింది.

తనిఖీలకు సంబంధించిన నోటీసులు చూపించిన అధికారులు ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో లక్ష్మీనారాయణ రక్తపోటు పెరగడంతో కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఫ్యామిలీ డాక్టర్​ను ఇంటికి పిలిపించారు. అనారోగ్యంగా ఉన్న కారణంగా ఆస్పత్రిలో చేర్పించాలని ఫ్యామిలీ డాక్టర్ సూచించడంతో... వెంటనే అంబులెన్స్​లో స్టార్ ఆస్పత్రికి తరలించారు.

సీఐడీ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకొని ఏపీలోని మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు సుబ్బారావు నివాసంలోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు. షాబాద్​లోని ఆయన ఇంట్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: MLC Elections Voting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు

Last Updated : Dec 10, 2021, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.