ఆంధ్రప్రదేశ్‌లోని కడప స్టీల్ ప్లాంట్‌పై ఆ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. స్టీల్ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను ఎస్సార్ స్టీల్స్‌కు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరాలను వెల్లడించారు.
కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1,448 కోట్లు మంజూరుకు ఆమోదముద్ర వేశామని తెలిపారు. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రోడ్లతో పాటు 5 ఎకరాల్లో స్కై టవర్స్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ టీకాలకు ప్రభుత్వం మళ్లీ అనుమతి