AP New districts: ఏపీలో కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో మార్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్చువల్‌గా కేబినెట్ నోట్‌ను ఉన్నతాధికారులు సర్క్యులేట్ చేయగా.. ఆ మేరకు మార్పులను మంత్రివర్గం ఆమోదించింది. కొత్త జిల్లాలపై ఈ రాత్రికి గానీ రేపు ఉదయంగానీ తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల కేటాయింపుపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోలు ఇవ్వనున్నారు. మెుత్తంగా 26 జిల్లాలు, 73 రెవెన్యూ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
కొత్త జిల్లాలు: మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లా, కోనసీమ, కాకినాడ, ఏలూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాలు
కొత్త రెవెన్యూ డివిజన్లు: పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తి.
ఏర్పాట్లు పూర్తి: కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే కార్యాలయాలు సిద్ధమయ్యాయి. అందులో సౌకర్యాల ఏర్పాటు సైతం పూర్తి కావొచ్చింది. వాస్తవానికి ఉగాది రోజునుంచే కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.. కానీ వివిధ కారణాలతో ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 గంటల మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సర్కారు ఆదేశాల ప్రకారం.. అధికారులు పనుల పర్యవేక్షణ వేగవంతం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఎంపిక చేసిన భవనాల్లో వసతుల కల్పన పనులు వేగవంతం చేశారు.
ఇదీ చదవండి: ఇకపై మరింత వేగంగా హైదరాబాద్ మెట్రో పరుగులు