ETV Bharat / city

BJP on AP CM JAGAN: 'తెలంగాణ అంటే జగన్​కు అంత భయమెందుకు?' - telangana news

తెలంగాణ చర్యలతో నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని ఏపీ భాజపా నేత విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయలేదని.. ప్రజలపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమిలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్రం పరిధిలోకి రాదని అన్నారు.

ap bjp fires on jagan, ap fires on telangana
ఏపీ సీఎం జగన్‌పై భాజపా ఆగ్రహం, ఏపీ ప్రభుత్వంపై విష్ణువర్దన్‌రెడ్డి ఆగ్రహం
author img

By

Published : Jul 12, 2021, 4:26 PM IST

ఆంధ్రప్రదేశ్ నీటి హక్కుల్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తున్నా... వైకాపా ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని భాజపా ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం నీటిని దొంగతనం చేయడమే కాకుండా... ఏపీని బెదిరిస్తోందన్నారు. జగన్ కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని దయనీయ పరిస్థితి ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ చర్యలతో నీరు సముద్రంలోకి వృథాగా పోతోందని... ప్రాజెక్టు వద్దకు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే వెళ్లలేని పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. కేవలం కేంద్రానికి లేఖలు రాసి జగన్ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు ప్రాజెక్టులను ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. కేవలం ఆస్తులను రక్షించుకోవడం కోసమే తెలంగాణ ముఖ్యమంత్రికి భయపడుతున్నారని ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేంద్ర పరిధిలోకి రాదన్నారు. జల వనరుల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా ఉద్యమం చేస్తుందని తెలిపారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ప్రజలపై పన్నుల భారం మోపడం మినహా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి... ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి కల్పించారన్నారు. అప్పుల కోసం జగన్ చంద్ర మండలానికి వెళ్లేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. 60 కులాలకు కార్పొరేషన్లు పెట్టి ఏ ఒక్క కులానికైనా న్యాయం చేశారా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: AP CM: మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.