AMARANATH: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి గల్లంతైన ఏపీ వాసుల వివరాలను ఏపీభవన్ అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో రాష్ట్రానికి చెందిన ఐదుగురు యాత్రికులు ఉండగా అందులో ఒకరు క్షేమంగా ఉన్నారు.
- వినోద్ అశోక్ - విజయవాడ
- గునిశెట్టి సుధ - రాజమహేంద్రవరం
- మధు - తిరుపతి
- ఝాన్సీలక్ష్మి - గుంటూరు
అమరనాథ్ యాత్రకు వెళ్లిన విజయనగరం వాసి నాగేంద్రకుమార్ క్షేమంగా ఉన్నారు. విజయనగరంలోని తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన వానపల్లి నాగేంద్రకుమార్.. క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. అమర్‌నాథ్ యాత్రికుల కోసం ఇప్పటికే ఏపీ భవన్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు హెల్ప్‌లైన్ నెంబర్ 011-23387089ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
మరోవైపు అకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన అమర్నాథ్లో సహాయ చర్యలు రాత్రి నుంచి ఉదయం వరకూ కొనసాగాయి. ఇప్పటివరకూ 16 మంది మృతి చెందినట్లు తేలగా.. రాత్రి నుంచి కొనసాగిన సహాయ చర్యల్లో.. కొట్టుకుపోయినట్లుగా భావిస్తున్నవారి మృతదేహాలు లభించలేదని అధికారులు తెలిపింది. ప్రస్తుత అమర్‌నాథ్‌కు భక్తులను అనుమతించంలేదు.
జమ్మునుంచి బేస్ క్యాంప్ ప్రాంతాలకు సహాయ చర్యలకు వచ్చే కాన్వాయ్‌లను మాత్రమే అనుమతిస్తున్నారు. వాల్ రాడార్లు, ప్రొక్రెయిన్‌లు వంటి.. భారీ సహాయక సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. అమరానాథ్ యాత్రికులను తరలించేందుకు.. సహాయ చర్యలకు వైమానిక దళం 8 హెలికాఫ్టర్లను రంగంలోకి దింపింది. సహాయ చర్యలకు అవసరమైన సామాగ్రిని ఈ హెలికాఫ్టర్లలోనే తరలించినట్లు వాయుసేన తెలిపింది.
ఇవీ చదవండి: ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద... గేట్లెత్తి దిగువకు నీటి విడుదల