ETV Bharat / city

ANTI GROPING DEVICE: ఆకతాయిలను పట్టించే యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌ - యాంటీ న్యూసెన్స్‌ స్టాంపు’ పేరుతో యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌

అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు వెంటపడి వేధించే ఆకతాయిలు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిని పట్టించేందుకు సచిహతా ఇంక్‌ అనే స్టాంపుల తయారీ సంస్థ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌ తయారు చేసి లైంగిక వేధింపులకు పాల్పడేవారి పనిపట్టేందుకు సిద్ధమైంది.

anti-groping-device-invented-for-women-safety
ఆకతాయిలను పట్టించే యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌
author img

By

Published : Jul 16, 2021, 3:24 PM IST

రైళ్లు, బస్సుల్లో రద్దీగా ఉన్న సమయాల్లో అమ్మాయిలు కనిపిస్తే చాలు.. అల్లరిపెట్టే ఆకతాయిల సంఖ్య తక్కువేం కాదు. ఇటువంటివారి ఆట కట్టించడానికే ఈ యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌. లైంగిక వేధింపులకు పాల్పడేవారిని గుంపులో ఉన్నా దీని సాయంతో గుర్తించొచ్చు. జపాన్‌లో తొలిసారిగా బాధితుల కోసం ఈ పరికరాన్ని విడుదల చేస్తే, అరగంటలోపే మొత్తం 500 పరికరాలు అమ్ముడుపోవడం విశేషం.

యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌...

టోకియో మెట్రోపాలిటన్‌ పోలీస్‌ స్టేషన్‌లో 2017లో వచ్చిన ఫిర్యాదులను చూస్తే, వాటిలో 1,750 కేసులు రైళ్లలో రద్దీగా ఉన్నప్పుడు మహిళలు లైంగిక వేధింపులకు గురైనవే. వీటిలో 50 శాతం రైళ్లలో కాగా, 20 శాతం రైల్వేస్టేషన్లలో మహిళలపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడుతున్నట్లు తేలింది. దీన్ని అరికట్టే దిశగా ఆ దేశానికి చెందిన సచిహతా ఇంక్‌ అనే స్టాంపుల తయారీ సంస్థ నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇదే యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌. పోర్టబుల్‌ ఈవీ స్టాంపుగా పిలిచే ఈ పరికరాలు చేతిలో ఇమిడిపోయే చిన్న లిప్‌స్టిక్‌ పరిమాణంలో ఉంటాయి. దీన్ని బ్యాగు లేదా జేబులకూ ఎటాచ్‌ చేసుకోవచ్చు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎవరైనా పక్కన కూర్చుని లేదా నిలబడి వేధింపులకు గురి చేస్తుంటే వారికి తెలియకుండానే ఆ చేతిపై బాధితురాలు ఈ పరికరానికి ఉన్న మూతతో సున్నితంగా టచ్‌ చేస్తే చాలు.

దుండగుడి చేతిపై కంటికి కనిపించని ఇంక్‌

కంటికి కనిపించని ఇంక్‌ ఆ మూతద్వారా అగంతకుడి చేతిపై ముద్రగా పడుతుంది. అరగంట తర్వాత అది ఫ్లోరోసెంట్‌ వెలుతురులో మాత్రమే కంటికి కనిపిస్తుంది. ఈ లోపు సమీపంలోని పోలీసు స్టేషన్‌కు సమాచారాన్నిస్తే చాలు. ఆ గుర్తుతోనే వాడు ఊచలు లెక్క పెట్టాల్సిందే. సచిహతా ఇంక్‌ సంస్థ ప్రయోగాత్మకంగా మొదటిసారి 500 డివైస్‌లను డిజైన్‌ చేసింది. ‘యాంటీ న్యూసెన్స్‌ స్టాంపు’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసిన అరగంటలోపే మొత్తం సేల్‌ అయిపోయాయి. అంతేకాకుండా జపాన్‌లో ఓసారి ఇద్దరు విద్యార్థినులు రైల్వేస్టేషన్‌లో తమపై వేధింపులకు గురిచేసిన వారిని వెంబడించిన వీడియో వైరల్‌ అయ్యింది. తమ వద్ద ఉన్న యాంటీ గ్రోపింగ్‌ డివైస్‌తో వారి చేతిపై ముద్రవేయడానికి వాళ్లు ప్రయత్నించడం ఆ వీడియోలో ఉంటుంది. ఈ సంఘటనతో ఆ సంస్థ తిరిగి ఈ డివైస్‌ల తయారీని పెంచడం విశేషం.

ఇదీ చూడండి: ఆకతాయిల చిట్టా సిద్ధం.. రెండోసారి చిక్కితే అంతే ఇక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.