కీసర లంచం కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులను కస్టడీకి అనుమతిస్తూ అనిశా కోర్టు తీర్పు వెల్లడించింది. మంగళవారం నుంచి 3 రోజులపాటు నాంపల్లి అనిశా కార్యాలయంలో మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్, శ్రీనాథ్, అంజిరెడ్డిని అధికారులు విచారించనున్నారు.
చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను అనిశా కస్టడీలోకి తీసుకోనుంది. రూ.కోటి 10 లక్షల లంచం వ్యవహారంపై ఆరా తీయనుంది. తహసీల్దార్ నాగరాజు సమక్షంలో బ్యాంక్ లాకర్‌ను కూడా అనిశా అధికారులు తెరవనున్నారు.
ఇవీ చూడండి: 'పరీక్షలను వాయిదా వేయగలం కానీ ... రద్దు చేయలేం'