ETV Bharat / city

లాక్​డౌన్​లో పేదలకు అండగా అన్నపూర్ణ క్యాంటీన్లు

కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఆసరాగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం విధించిన పది రోజుల లాక్‌డౌన్‌తో నగరంలో పస్తులుంటున్న... నిరాశ్రయులు, చిరు వ్యాపారుల ఆకలి తీరుస్తున్నాయి.

annapurna canteen, annapurna canteen in ghmc
అన్నపూర్ణ క్యాంటీన్, జీహెచ్​ఎంసీలో అన్నపూర్ణ క్యాంటీన్
author img

By

Published : May 14, 2021, 11:01 AM IST

జీహెచ్​ఎంసీ పరిధిలో 150 అన్నపూర్ణ కేంద్రాలు రోజూ ఐదు రూపాయలకే భోజనాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో మరిన్ని అన్నపూర్ణ కేంద్రాలు తెరిచి అవసరమైన వారందరికీ భోజనాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అదనంగా 100 అన్నపూర్ణ కేంద్రాలు నగరంలో ప్రారంభమయ్యాయి.

మొత్తం 250 కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 45 వేల మందికి భోజనం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ వేళ 5 రూపాయాలకే మంచి భోజనం అందించడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.