ETV Bharat / city

రెండు పదవులు.. నాలుగు పేర్లు.. నెలాఖరులో ఏపీ మంత్రివర్గ విస్తరణ!

రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ.. మంత్రిపదవులకు రాజీనామా చేయడంతో... ఏపీ మంత్రివర్గ విస్తరణపై అధికార వైకాపాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఖాళీ అయిన 2 పదవుల కోసం నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ap cabinet
ap cabinet
author img

By

Published : Jul 6, 2020, 1:13 PM IST

పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన మంత్రి పదవులకు ప్రధానంగా నలుగురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోనే ఏపీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని పార్టీ వర్గాలు చెబుతుండటంతో.. పదవులు ఎవరికి వరిస్తాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణారావు స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సిదిరి అప్పలరాజు, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్​ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణుగోపాలకృష్ణా, కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురిలో ఇద్దరు బోస్‌, మరో ఇద్దరు మోపిదేవి సామాజిక వర్గానికి చెందిన వారు.

పొన్నాడ సతీశ్, జోగి రమేశ్‌ ఇ్దదరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిదిరి అప్పలరాజు, గోపాలకృష్ణా తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గోపాలకృష్ణా అంతకుముందు జడ్పీ ఛైర్మన్‌గానూ పనిచేశారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రివర్గంలోకి తీసుకున్న వారిలో జూనియర్లకు చోటు దక్కలేదు. ఇప్పుడైనా తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తారా? లేదా? అనే సందేహాలున్నాయి.

మోపిదేవి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో గుంటూరు జిల్లా నుంచే మరొకరికి అవకాశం కల్పించాల్సి వస్తే అనుహ్యంగా కొత్తపేర్లు వచ్చే అవకాశము లేకపోలేదు. మోపిదేవి రాజీనామాతో మంత్రివర్గంలో గుంటూరు జిల్లా ప్రాతినిధ్యం రెండు నుంచి ఒకటికి తగ్గింది. ఈ స్థానాన్ని బీసీల నుంచి భర్తీ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పేర్లు పరిశీలించాల్సి ఉంటుంది. వీరిలో జంగా సీనియర్‌ నేత కాగా.... రజనీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనరల్‌ కేటగిరి నుంచి మాచర్ల, మంగళగిరి ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆశావహుల జాబితాలో ఉన్నా వీరి పేర్లు పరిశీలనకువచ్చే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత మంత్రిమండలిలోని కొందరి శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ... బీసీ మంత్రికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇవ్వనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.