ETV Bharat / city

గంగాఘాట్​లో ఆ ముఖ్యమంత్రుల ఫొటోలకు పుణ్యస్నానం - హరిద్వార్​లో ఏపీ సీఎం ఫొటోకు గంగా స్నానం

వసంత పంచమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి హరిద్వార్​లోని హర్ కీ పౌరి ఘాట్​లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు ఫొటోలకు గంగాస్నానం చేయించి మొక్కులు సమర్పించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

andhra pradesh resident took a Ganga bath at Har ki Pauri with photographs of three chief ministers
గంగాఘాట్​లో ఆ ముఖ్యమంత్రుల ఫొటోలకు పుణ్యస్నానం
author img

By

Published : Feb 16, 2021, 5:00 PM IST

దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్​ హరిద్వార్​లోని హర్​ కీ పౌరి ఘాట్​లో వందలాది మంది భక్తులు గంగ స్నానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్​కు చెందిన పున్నాల గౌరీశంకర్ అనే వ్యక్తి హరిద్వార్​ను సందర్శించారు. పౌరి ఘాట్​లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, త్రివేంద్ర సింగ్ రావత్​ల ఫొటోలకు గంగా స్నానం చేయించారు.

andhra pradesh resident took a Ganga bath at Har ki Pauri with photographs of three chief ministers
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

వసంత పంచమి సందర్భంగా.. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని గంగా, సరస్వతీ అమ్మవార్లను వేడుకున్నట్లు పున్నాల గౌరీశంకర్ తెలిపారు. ఈ రాష్ట్రాల ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు వెల్లడించారు.

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్

ప్రస్తుతం దేశం ఆర్థికంగా నష్టాల్లో ఉందని, వీలైనంత త్వరగా ప్రగతిలో భారత్ వేగం పుంజుకోవాలని గౌరీశంకర్ అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సదిశలో నడిపే విధంగా ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని సూచించారు.

మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలకు గంగా స్నానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.