చెదురుమదురు ఘటనలు మినహా.. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్ని జిల్లాల్లో పట్టణ, నగర ఓటర్లు ఉత్సాహంగా ఓటేయడంతో 62.28శాతం పోలింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 75.93శాతం, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 62.53 శాతం పోలింగ్ జరిగింది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 70.66 శాతం పోలింగ్ నమోదు కాగా కార్పొరేషన్లలో 57.14 శాతానికే పరిమితమైంది. కార్పొరేషన్లలో అత్యధికంగా ఒంగోలులో 75.52 శాతం మంది ఓట్లేశారు. కర్నూలులో అత్యల్పంగా 49.26 శాతం పోలింగ్ నమోదైంది. కొన్నిచోట్ల ప్రధాన పార్టీల మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తగా పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
జిల్లాల వారీగా పురపాలక సంఘాల్లో పోలింగ్ శాతం ఇలా...
శ్రీకాకుళం | 71.52 |
విజయనగరం | 74.61 |
విశాఖ | 74.63 |
తూర్పుగోదావరి | 75.93 |
పశ్చిమగోదావరి | 71.54 |
కృష్ణా | 75.90 |
గుంటూరు | 69.19 |
ప్రకాశం | 75.46 |
నెల్లూరు | 71.06 |
అనంతపురం | 69.77 |
కర్నూలు | 62.53 |
కడప | 71.67 |
చిత్తూరు | 69.60 |
ఇదీ చదవండి: గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం