ETV Bharat / city

IPS OFFICERS TRANSFERRED : ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ

ఏపీలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 16 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ, పదోన్నతిని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Jul 7, 2021, 7:04 AM IST

ips officers transfer in ap
ips officers transfer in ap

ఏపీలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. మరికొందరికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారికి పదోన్నతి కల్పించి దిశా డీఐజీగా నియమించారు. దీంతోపాటు డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ డీఐజీగాను బాధ్యతలు అప్పగించారు. కృష్ణా, తూర్పుగోదావరి ఎస్పీలను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీచేశారు.

విజయనగరం ఎస్పీగా ఎం.దీపిక నియమితులయ్యారు. రైల్వే ఎస్పీగా ఉన్న సీహెచ్ విజయరావును నెల్లూరు ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణ జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబును తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పంపారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ హస్మిని గ్రే హౌండ్స్ కమాండర్​గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సిద్ధార్థ్ కౌశల్​ను కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. వై.రిశాంత్ రెడ్డిని గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ అడ్మిన్గా​ పోస్టింగ్ ఇచ్చారు.

ఎస్.సతీష్ కుమార్​ను స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అదనపు ఎస్పీగా, విద్యాసాగర్ నాయుడును ఎస్ఈబీ అదనపు ఎస్పీగా, గరికపాటి బిందు మాధవ్​ను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా, తుహిన్ సిన్హాను ఎస్ఈబీ అదనపు ఎస్పీగా బదిలీ చేశారు. పి. జగదీష్​ను విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జి కృష్ణకాంత్​ను తూర్పుగోదావరి జిల్లా చింతూర్ ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. వి ఎన్ మణికంఠ ఛందోలును విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు. కృష్ణకాంత్ పాటిల్​ను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం అసిస్టెంట్ ఎస్పీగా నియమించారు. తుషార్ దూడిని విశాఖపట్నం జిల్లా చింతపల్లి అసిస్టెంట్ ఎస్పీగా బదిలీ చేశారు.

ఇదీచూడండి: నేడే మంత్రివర్గ విస్తరణ- పూర్తైన కసరత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.