ఫ్రాన్స్ నుంచి వచ్చిన అనంతపురం వ్యక్తికి బెంగళూరులో కరోనా నిర్ధరణ అయిందని ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. బాధితుడు కొద్దిరోజులు పుట్టపర్తిలో ఉన్నాడని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఆ సమయంలో బాధితుడితో కలసి ఉన్న ఐదుగురిని క్వారంటైన్‌కు పంపించామని ప్రభుత్వం తెలిపింది.
విదేశాల నుంచి వచ్చిన ఒక వెయ్యి 15 మందిని ఐసోలేషన్‌లో ఉంచామని, మక్కా వెళ్లొచ్చి క్వారంటైన్ కేంద్రంలో ఉన్న 31 మంది హిందూపురం వ్యక్తుల నమూనాలు సేకరించామని కలెక్టర్ చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన మరో 54 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని వెల్లడించారు.
ఇవీ చదవండి: కరోనా వైద్యుల పాటకు నెటిజన్లు ఫిదా