ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు: ఆనందయ్య

మందు పంపిణీకి సహకారం కోరుతూ ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖపై ఇప్పటివరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదని ఆనందయ్య పేర్కొన్నారు. సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుంటే.. తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు: ఆనందయ్య
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు: ఆనందయ్య
author img

By

Published : Jun 10, 2021, 2:05 AM IST

మందు పంపిణీపై ప్రభుత్వ సహకారం కావాలంటూ ప్రభుత్వానికి రాసిన లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి సందేశం లేదని కృష్ణపట్నం ఆనందయ్య అన్నారు. మందు పంపిణీపై ప్రభుత్వ సహకారం కావాలంటూ ఈ నెల 7న ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. ఔషధాన్ని ఇంటి వద్దకు పంపిణీ చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరం ఉందని.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆనందయ్య అన్నారు.

సాయంత్రం చర్చిస్తాం..

రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పంపించాలంటే ఏం చేయాలి.. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకు ఔషధ పంపిణీకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాన్ని తమ బృందంతో సాయంత్రం చర్చిస్తానని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తామని.. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామని వివరించారు.

కృష్ణపట్నంలో అందరికీ ఇప్పటికే పంపిణీ పూర్తి చేశామని.. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని ఆనందయ్య తెలిపారు. ఇప్పటికిప్పుడు 50 వేల మంది పాజిటివ్ వ్యక్తులకు పంపిణీ చేసే విధంగా మందు సిద్ధంగా ఉందని తెలిపారు. కొవిడ్ రాని వారి కోసం మందును తయారు చేయాల్సి ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: కరోనా తగ్గిపోయాక చికిత్స గరిష్ఠ ధరలు ఖరారు చేస్తారా..?: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.