ఏపీసీఆర్డీఏ రద్దు చేస్తూ చేసిన చట్టం ఆమోదం పొందటంతో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని నోటిఫై చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి సీఆర్డీఏ భౌగోళిక పరిధి అంతా ఏఎంఆర్డీఏ పరిధిలోనికి వస్తుందని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చినందున 2014లో చేసిన సీఆర్డీఏ ఇక ఉనికిలో ఉండబోదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఏఎంఆర్డీఏకు పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడుగా 11 మంది అధికారులు సభ్యులుగా పాలక కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఏఎంఆర్డీఏ కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ తదితరులు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. తర్వాత ఛైర్మన్‌తో పాటు సభ్యులను నియామకం ఉంటుందని పేర్కొన్నారు. ఇక మరో ఉత్తర్వులో ఏఎంఆర్డీఏకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ అంశాలకు సంబంధించి పురపాలక శాఖ నాలుగు రహస్య ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: కారుతో పోటిపడి పరిగెత్తిన ఆవు.. తర్వాత ఏమైంది?